ETV Bharat / state

'రైతులు అధైర్యపడొద్దు.. తడిసిన ధాన్యాన్నీ కొంటాం' - pacs chairmain inspects pacs centre

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పీఏసీఎస్​ ఛైర్మన్​ సింగిరెడ్డి నర్సింహరెడ్డి పరిశీలించారు. రైతులు అధైర్యపడొద్దని.. ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

తుర్కపల్లి ధాన్యం కేంద్రం పరిశీలన
తుర్కపల్లి ధాన్యం కేంద్రం పరిశీలన
author img

By

Published : May 7, 2021, 5:29 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో గురువారం కురిసిన అకాల వర్షానికి పీఏసీఎస్​ కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. ఫలితంగా పీఏసీఎస్​ ఛైర్మన్ సింగిరెడ్డి నర్సింహరెడ్డి ఉదయం ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని.. తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

కొనుగోలు కేంద్రం వద్ద పనిచేసే వారు సక్రమంగా పని చేయాలని ఛైర్మన్​ సూచించారు. రైతులకు టార్పాలిన్ కవర్లు అందించాలని సిబ్బందికి తెలిపారు. ఈ సందర్భంగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని రైతులకు సూచించారు. పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.

ఛైర్మన్​తో పాటు ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, మండల కో-ఆప్షన్ సభ్యులు రహమత్ షరీఫ్, మండల వ్యవసాయ అధికారి ధాన్యాన్ని పరిశీలించారు.

ఇదీ చూడండి.. గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎస్​, సీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.