యాదాద్రి ప్రధానాలయానికి తుది మెరుగులు దిద్దే పనులను వైటీడీఐ అధికారులు ముమ్మరం చేశారు. యాదాద్రి ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న అష్టభుజ మండప ప్రాకారాల పైన తిరువీధులు, గోపురాలు... ఇలా ఆలయం నలువైపులా తుది మెరుగుల పనులు కొనసాగుతున్నాయి.
మరోవైపు అష్టభుజ మండపం ప్రాకారాలపై కట్టుబడి సున్నంతో వర్షపు నీరు కురవకుండా మరమ్మతులు చేస్తున్నారు. కృష్ణశిలతో ఏర్పాటు చేసిన ప్రాకార మండపాలపై తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఒకవైపు డంగు సున్నం గట్టిపడే విధంగా చర్యలు చేపడుతున్నారు. లీకేజీల ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వైటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక అద్దాల మండపం పైభాగంలో పనులు చేయిస్తున్నారు.
యాదాద్రి కొండపైన నూతనంగా నిర్మించిన క్యూకాంప్లెక్స్ స్లాబ్ పైన వాటర్ ఫ్రూఫింగ్ పనులకు వైటీడీఏ అధికారులు శ్రీకారం చుట్టారు. ఒకవైపు మౌలిక వసతుల కల్పన పనులు... మరోవైపు దిద్దుబాటు చర్యలు వేగంగా సాగుతున్నాయి.
ఇదీ చూడండి: దక్షిణ భారతంలో ఐసిస్ ఉగ్రవాదుల అలికిడి