యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో దైవ దర్శనాలు నిత్యారాధనలు కొనసాగుతున్నాయి. ఆలయ గడప బయటి నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివస్తున్న భక్తులు.. భౌతికదూరం, మాస్కు ధరించి దేవుడిని ప్రసన్నం చేసుకుంటున్నారు.
షరతులు వర్తిస్తాయి..
గుట్టపై ఆంక్షలు కొనసాగుతుండటం వల్ల.. దేవస్థానం కల్యాణ కట్టలో తలనీలాలు అనుమతించడం లేదు. ఫలితంగా భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రత్యమ్నాయంగా కొండ కింద ప్రైవేట్ సెలూన్లలో తలనీలాలు తీయించుకుంటున్నారు.
మొక్కు చెల్లించేందుకు అడ్డదారి..
ఉదయం నుంచే ప్రైవేట్షాప్ల వద్ద జనం గుంపులుగా ఉండి స్వామివారికి మొక్కు చెల్లించేందుకు గుండ్లు చేయించుకుంటున్నారు. ఇదే అదునుగా క్షురకులు భారీ సొమ్ము వసూలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: మరో తెరాస శాసన సభ్యుడికి కరోనా... గణేశ్ గుప్తాకు పాజిటివ్