కరోనా అనుమానితుడు కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్నాడనే సమాచారంతో యాదాద్రి జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్లోకి పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. కరోనా అనుమానితుడు ఏ1 కోచ్‌లో 13 బెర్త్ నెంబర్‌పై వస్తున్నట్లు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రవీంద్రకి సమాచారం రావటం వల్ల స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా అనుమానితుడి స్వస్థలం ఏపీలోని ఏలూరుకు చెందినట్లుగా గుర్తించారు.
అనుమానిత వ్యక్తి ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి హైదరాబాద్ వచ్చాడు. అనంతరం సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో నాగపూర్ వెళ్తుండగా, భువనగిరి రైల్వే స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇతరులకు వైరస్ సోకకుండా అతను ప్రయాణించిన బోగీలో రైల్వే అధికారులు స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ని నలభై నిమిషాలు ఆపివేశారు.