యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం తాళ్ల గూడెం స్టేజీ హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కపల్లి మండలం వేలుపల్లి గ్రామానికి చెందిన గుగులోతు రాజు తన ద్విచక్రవాహనంపై ఆలేరు మండలం కందిగడ్డ తండా గ్రామానికి వెళ్తుండగా... లారీ వెనకు నుంచి వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. బైక్పై ఉన్న గుగులోతు రాజు పక్కనే ఉన్న వాగులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదంతో కిలో మీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వాహన రాకపోకలను పునరుద్ధరించారు.
ఇవీ చూడండి: మధ్య మానేరు ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్