యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్పల్లిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కేమిడి సోమయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఓ మహిళ ఇంట్లో నిద్రిస్తుండగా... ఆమె వద్దకు వెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాధిత మహిళ అరుపులతో స్థానికులు అక్కడికి చేరుకొని నిందితుడిని పట్టుకున్నారు.
అనంతరం గ్రామస్థులు, బాధిత మహిళ ఫిర్యాాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సోమయ్య మద్యం మత్తులో ఉండే... ఈ అరాచకానికి పాల్పడ్డట్టు గ్రామస్థులు తెలిపారు.
ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!