యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి మల్లాపురం వరకు రోడ్డు విస్తరణ పనులు చకచకా సాగుతున్నాయి. కొంతకాలంగా నెమ్మదించిన పనులు ఇటీవల ఊపందుకున్నాయి. భూసేకరణలు జరిపి... ఆధునిక యంత్రాలతో పనుల్లో వేగం పెంచారు.
రెండు వరుసలుగా 100 అడుగుల విస్తరణలో రహదారి నిర్మాణం జరుగుతోంది. ఒకప్పుడు ఇరుకైన రోడ్డుతో ఇబ్బందులు పడ్డ వాహనదారులు, ప్రజలు విస్తరణ పనులు జరుగుతున్నందున హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి