ETV Bharat / state

అక్రమ వెంచర్.. హద్దు రాళ్లు తొలగించిన అధికారులు - తెలంగాణ వార్తలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సమీపంలోని భూమిలో అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన అధికారులు... హద్దు రాళ్లు తొలగించినట్లు వెల్లడించారు. క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

venture, illegal lay out
అక్రమ వెంచర్, యాదగిరిగుట్ట వెంచర్
author img

By

Published : Jun 19, 2021, 12:35 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ వెంచర్ అక్రమంగా వెలిసినట్టు తెలుస్తోంది. 2007లో 32 ఎకరాల స్థలంలో వెంచర్ చేయగా అప్పుడు గ్రామ పంచాయతీకి పదిశాతం భూమి కోసం మూడు ఎకరాల స్థలాన్ని వదిలివేశారని స్థానికులు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను ఆ స్థలంపై పడి... అక్రమంగా ఫ్లాట్లు వేసి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భూమి సుమారుగా రూ.6 నుంచి 10కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ స్థలంలో ఉన్న హద్దు రాళ్లు తొలగించి శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వెంచర్ నిర్వాహకుడిపై క్రిమినల్ చర్యలు కోసం పోలీసు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు.

సైదాపురం గ్రామంలో 2007లో 32 ఎకరాల్లో అహోబిలం పేరుతో వెంచర్ ఏర్పాటు చేశారు. ఈ స్థలం కబ్జాకు గురైందని నిర్వాహకుడు రఘునందన్​పై మాజీ ఎంపీటీసీ భర్త బీర్ల మహేశ్ కలెక్టర్​కు ఫిర్యాదు చేయగా... సర్వే చేసి హద్దు రాళ్లను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మండలం పంచాయతీ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి: palle pragathi: గ్రామాల్లో పచ్చదనం పెంపొందించాలి: మంత్రి ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.