యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా యాదాద్రి ఆలయ కొండపైకి వెళ్లే ప్రధాన రహదారి పనులు రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నిలిచిపోయాయి. పెద్దగుట్టపైన (టెంపుల్ సిటీ) ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారులు భారీ వర్షాలకు వరద నీటితో కయ్యలుగా మారాయి. టెంపుల్ సిటీ నుంచి కిందికి వచ్చే దారి కయ్యలుగా మారడం వల్ల ఒక దారిని ఆపివేశారు. అధికారులు వీటిని తాత్కాలికంగా వేశామని, ఇంకా పూర్తిగా రోడ్ల విస్తరణ జరగలేదని చెప్తున్నారు.
ఇవీ చూడండి: రాములోరి సన్నిధిలో అసాంఘికం... మిథిలలో మద్యపానం