ETV Bharat / state

యాదాద్రిలో ప్రాంగణాలకు తగ్గట్లు నామకరణాలు - యాదాద్రిలో నామకరణాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు యాదాద్రిలోని ప్రాంగణాలకు తగ్గట్లు అధికారులు త్వరలోనే నామకరణం చేయనున్నారు. ఆలయ పునర్నిర్మాణాలు తుది దశకు చేరగా వాటికి శ్రావ్యమైన పేర్లతో వినియోగంలోకి తేవాలని యాడ కసరత్తు చేస్తోంది.

yadadri
yadadri
author img

By

Published : Apr 29, 2021, 12:13 PM IST

భక్తి భావం పెంచేలా ఆత్మానందం, ఆహ్లాదం కలిగేలా… మధురానుభూతి పొందేలా.. ఆధ్యాత్మిక చింతన పెంపొందించేలా యాదాద్రి ప్రాంగణాలకు తగ్గట్లు నామకరణం చేయాలన్న సీఎం కేసీఆర్ సూచనలు త్వరలోనే ఆచరణలోకి రానున్నాయి. విశ్వ ఖ్యాతి పొందేలా యాదాద్రి క్షేత్రాన్ని అభివృద్ధి పరుస్తున్న ప్రణాళికలో క్షేత్ర పరిసరాలు, భక్తులకు ఏర్పాటయ్యే వనరులను మరెక్కడా లేని తరహాలో కల్పించాలన్న తలంపుతో ఈ నిర్మాణాలను చేపట్టారు. ఆలయ పునర్నిర్మాణాలు తుది దశకు చేరగా వాటికి శ్రావ్యమైన పేర్లతో వినియోగంలోకి తేవాలని యాడ కసరత్తు చేస్తోంది.

శ్లోకాలతో పరిసరాలు..

క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికులు మానసిక ఉల్లాసాన్ని కలిగించేలా ఇక్కడి పరిసరాలను భగవంతుని స్తుతించే శ్లోకాలు క్షేత్ర విశిష్ఠతను తెలిపే చిత్రాలతో తీర్చిదిద్దే యోజనలో యంత్రాంగం శ్రమిస్తోంది. కొండ చుట్టు నిర్మితమవుతున్న గిరి ప్రదక్షిణ దారిని పచ్చని చెట్లు రకరకాల పూల మొక్కలతో ఆహ్లాదంగా రూపొందించి మళ్లీ రావాలి అనిపించేలా మహా దివ్య పుణ్యక్షేత్రంగా ఆవిష్కరించనున్నారు.

శిల్పకళ ఉట్టిపడేలా..

కొండపై హరిహరుల ఆలయాల చెంత ప్రసాద విభాగం, ఉత్తర దిశలో నిర్మితమవుతున్న కట్టడాలకు క్షేత్ర ప్రాశస్త్యాన్ని పెంచే పేర్లతో భక్తులకు అందుబాటులోకి తేవనున్నారు. ప్రధాన ఆలయం చుట్టూ ప్రాచీన కళ ఉట్టిపడేలా శిల్పకళను తీర్చిదిద్దుతున్నారు. దర్శన వరుసల కాంప్లెక్స్ కు సరికొత్త నామకరణం జరగనుంది. ఆలయ సన్నిధిలో కొండపై బస్ బేను మందిర ఆకారంతో నిర్మించాలని ఈ మేరకు నమూనా ఇప్పటికే రూపొందించారు. కొండెక్కి, దిగే కనుమ దారులకూ క్షేత్రానికి చెందిన పేర్లను పెట్టనున్నారు. ఆలయానికి నలువైపులా గల మాడ వీధులను దేవుడి నామాలతో ఆవిష్కరణకు యత్నాలు జరుగుతున్నాయి.

ఆలయ నగరిలో...

పలు చోట్ల నుంచి వచ్చే యాత్రికుల బస కోసం కొండకింద పెద్ద గుట్టపై 1000 ఎకరాల భూసేకరణ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాటేజీల నిర్మాణానికై 250 ఎకరాల్లో లే అవుట్ పనులు చేపట్టారు. విశాల రహదారులతో రూపొందిన ఆలయ నగరిలోని వీధులను దేవతామూర్తుల పేరిట వినియోగంలోకి తేనున్నారు. దేవుళ్ల పేరిట వీధులను కాటేజీలతో అభివృద్ధి చేసే యోచనలో అధికారులు ఉన్నారు.
ఇప్పటికే పుష్కరిణీలకు నామకరణం జరిగింది. కొండపైన" విష్ణు" కొండ కింద "లక్ష్మీ" పేరిట ఏర్పాటవుతున్నాయి. గండిచెరువు చెంత కొండ కింద ఉత్తర దిశలో గండిచెరువు ప్రాంగణాన్నీ భక్తజనులకు ఉపయోగపడే వనరులతో అభివృద్ధి చేస్తున్నారు. మొక్కులు తీర్చుకొనేందుకు వీలుగా ఆ ప్రాంతంలో పుష్కరిణీ, వ్రతమండపం, అన్న ప్రసాద భవనం, దీక్షపరుల మండపంతో పాటు కళ్యాణకట్ట నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంగణాలు భగవంతుని పేర్లతో మున్ముందు భక్తులకు అందుబాటులోకి రానున్నాయని యాడా చెబుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.