యాదాద్రిలో స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి ముందుగానే ఆలయ ప్రవేశ ద్వారంపై కృష్ణ శిలలతో నరసింహుడి కథలు భక్తులకు సాక్ష్యాత్కరించనున్నాయి. ఆలయంలో ఎటు చూసినా స్వామి వారి విగ్రహాలు కనిపించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ఆ మేరకు అధికారుల దిశానిర్ధేశంతో శిల్పులు గర్భాలయం, ప్రవేశద్వారం పక్కన రాతిగోడపై నరసింహుడి ప్రతిమలను ఆవిష్కరించారు. గర్భాలయంలో రాతి గోడపై చెక్కిన సర్పంపై జ్వాలా నారసింహుడు, యోగానంద నరసింహ స్వామి, ఉగ్రనరహరి, శ్రీలక్ష్మీదేవి సమేత నారసింహుడు, గండభేరుండ రూపంలో నరసింహ స్వామి వంటి వివిధ రూపాలను శిల్పులు తీర్చిదిద్దారు.
ప్రధాన ఆలయ పునర్నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో శిల్పాలకు తుది మెరుగులు పూర్తి అవుతున్నాయని స్థపతులు తెలిపారు. ప్రధాన ఆలయం, బయటి ప్రాకారాల కప్పుపై కృష్ణ శిలలను భారీ క్రేన్ సహాయంతో అమర్చుతున్నారు. ఉత్తర భాగంలో భూ గర్భ కేబుల్స్ కోసం సిమెంట్ పైపులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానాలయం లోపల, ఏసీ విద్యుత్ తీగలను అమర్చడానికి భూగర్భ కేబుల్స్ వేయనున్నారు. ప్రధాన ఆలయం చుట్టూ ఫ్లోరింగ్ పనులు కొనసాగుతున్నాయి.
ఇవీ చదవండి: శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు సీజే మహేశ్వరి