నూతన రూపు సంతరించుకుంటున్న యాదాద్రి ఆలయ సమీపాన... ప్రకృతి రమణీయతను కళ్లకు కట్టేలా ఈ పార్కులను అందుబాటులోకి తెచ్చారు. పచ్చదనం ఉట్టిపడేలా భువనగిరి-యాదాద్రి మార్గంలో ఏర్పాటు చేసిన రెండు అర్బన్ పార్కులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సహజసిద్ధమైన గుట్టల చెంతన అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి... పర్యాటకులకు కనువిందు చేయబోతున్నారు. రాయగిరి-1, రాయగిరి-2లోని మల్లన్న గుట్టల్లో పెంచిన వనాల్ని మంత్రి ప్రారంభించారు.
వివరాలిలా..
రాయగిరి-1 బ్లాక్ లోని రిజర్వ్ ఫారెస్టుకు... ఆంజనేయ అభయారణ్యంగా నామకరణం చేశారు. 56.65 హెక్టార్ల విస్తీర్ణానికి 2 కోట్ల 48 లక్షలు ఖర్చు చేశారు. ఇక రాయగిరి-2 బ్లాక్ లోని ప్రాంతానికి... నరసింహ అభయారణ్యంగా పేరు పెట్టారు. 97.12 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధికి గాను... 3 కోట్ల 57 లక్షలు వెచ్చించారు. ఇక్కడ వ్యూ పాయింట్లు, నడక మార్గాలు, సెల్ఫీ పాయింట్లు, జంతువుల బొమ్మలు, సహజ వనరులతో సీటింగ్‌తో పాటు రాక్ గార్డెన్ ఏర్పాటు చేశారు.
సుదూర ప్రాంతాల నుంచి యాదాద్రి క్షేత్రానికి వచ్చే ప్రయాణికులకు ఈ పార్కులు ఎంతో ఆహ్లాదాన్ని కల్గించనున్నాయి.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం... 20వేలు దాటిన కేసుల సంఖ్య