ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తులకు సదుపాయాలు కరువవుతున్నాయి. ఒకవైపు ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో యాదాద్రికి రోజు రోజుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల రాక పెరుగుతోంది. చాలీచాలని (కల్యాణకట్ట) తలనీలాలు సమర్పించే చోట తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డులోనే భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారు. ఒకవైపు స్వామి వారి విష్ణు పుష్కరిణి నిర్మాణ పనులు జరుగుతున్నందున గుండం లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. కనీస వసతులు కల్పించాలని దేవాలయ అధికారులను భక్తులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగనే ముఖ్య అతిథి..!