యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని నల్గొండ ఎస్పీ రంగనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు.
అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని ఎస్పీకి అందజేశారు. దర్శన సమయంలో వారి వెంట ఆలయ అధికారులు, ఆలయ ఏఇవో రమేశ్ బాబు, స్థానిక సీఐ తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్కు ఎన్నికలప్పుడే బీసీలు గుర్తుకొస్తారు: తలసాని