యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వృద్ధుల, వికలాంగుకు ఇబ్బంది పడకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్దకు రాలేని దివ్యాంగులు, వృద్ధులకోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. దానిలో తీసుకొచ్చి ఓటేయించి తిరిగి ఇంటి వద్ద దింపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పర్యవేక్షించారు.
ఇదీ చూడండి: చేతుల్లేకపోయినా.. ఓటేసి స్ఫూర్తినిచ్చాడు