ETV Bharat / state

'మహనీయుల స్ఫూర్తితో యువత ముందుకుసాగాలి' - ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి

ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో పర్యటించారు. స్థానిక అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్​రావుల విగ్రహాలను వారు ఆవిష్కరించారు.

Inauguration of BR Ambedkar Statue
ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి
author img

By

Published : Apr 18, 2021, 5:18 PM IST

దళితులకు కేబినేట్​లో ఉన్నత పదవులు కల్పించాలని సీఎం​కు లేఖ రాసినట్లు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆలేరు మండలంలోని కొలనుపాకలో స్థానిక అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్​రావుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత మరో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారిరువురు.. విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పోరాట యోధులు ఆరుట్ల కమలాదేవి, రాంచంద్రారెడ్డిలు పుట్టిన గ్రామంలో మహనీయుల విగ్రహాలను ఆవిష్కరణ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు కోమటి రెడ్డి. మహనీయుల ఆశయాలతో యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే సునీత సూచించారు. రాజ్యాంగంతో అన్ని వర్గాలకు వెలుగునిచ్చిన ఘనత బాబా సాహెబ్​కే దక్కుతుందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్, వైస్ ఎంపీపీ లావణ్య, ఎంపీటీసీ కవిత, సర్పంచులు, వార్డు మెంబర్లు, అంబేడ్కర్​ సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: జారాల ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు... త్వరలోనే టెండర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.