ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ కె.కేశవరావు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన నేతలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు. స్వామివారి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. యాదాద్రి ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని నేతలు అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందనుందని నేతలు కితాబిచ్చారు.
ఇదీ చదవండిః ఇలా చేస్తే... 'డెంగీ' మన దరి చేరదు...!