యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుస్తువులను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి సాయం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
అనంతరం పట్టణంలోని చేనేత కార్మికుల ఇళ్లలోని పేరుకుపోయిన పట్టు చీరలు, వస్త్ర నిల్వలను ఆయన పరిశీలించారు. వారి సమస్యలు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని నేతన్నలకు హామీ ఇచ్చారు.