ETV Bharat / state

కాంగ్రెస్​లో ఆదరణ కరువైంది... తెరాస​తో పోరాడే పార్టీతోనే నా ప్రయాణం: రాజగోపాల్​ రెడ్డి - MLA komatireddy Rajagopal Reddy on Party change

MLA Rajagopal Reddy on Party change: కేసీఆర్​ను గద్దె దించే ఏ పార్టీకైనా తాను మద్దతిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి స్పష్టం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్​ భాజపాలో చేరుతారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలను ఆయన తిప్పికొట్టారు. అదంతా దుష్ప్రచారమని స్పష్టం చేశారు. ఈ మేరకు యాదాద్రి జిల్లా చౌటుప్పల్​లో.. పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

MLA Rajagopal Reddy on Party change
ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి
author img

By

Published : Mar 16, 2022, 7:33 PM IST

MLA Rajagopal Reddy on Party change: ముఖ్యమంత్రి కేసీఆర్​తో పోరాడే పార్టీతోనే తన ప్రయాణం కొనసాగుతుందని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్​ భాజపాలో చేరుతున్నట్లు సామాజికమాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని.. ఏది చేసినా ప్రజలకు చెప్పే చేస్తామని రాజగోపాల్​ రెడ్డి తెలిపారు.

సొంత పార్టీలోనే తనకు ఆదరణ కరవైందన్న రాజగోపాల్​ రెడ్డి.. ఇవాళ జరిగిన సీఎల్పీ మీటింగ్​కు గైర్హాజరయ్యారు. కేసీఆర్​పై బలంగా పోరాడితే కాంగ్రెస్​లోనే ఉంటానని.. లేకుంటే ఏ పార్టీ గట్టిగా పోరాడితే అందులోనే చేరుతానని స్పష్టం చేశారు. ఏది చేసినా ప్రజల కోసమే చేస్తానని స్వార్థం కోసం పార్టీ మారనని తేల్చిచెప్పారు.

"మిగులు బడ్జెట్​లో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్​దే. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్​ పేరుతో ఆంధ్రా కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు దోచి పెట్టారు. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండి ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా మన ఊరు- మన బడి అని కార్యక్రమాలు తెస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రి భవనాలను పునరుద్ధరణ చేయకుండా.. ఇప్పుడు కొత్త ఆసుపత్రులు కడతామని చెబుతున్నారు. ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేశారు." -కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

సీఎం కేసీఆర్​తో పోరాడే పార్టీతోనే నా ప్రయాణం: ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి

ఇదీ చదవండి: హైవేల విస్తరణకు నిధులిచ్చి పనులు చేపట్టట్లేదు: రేవంత్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.