ETV Bharat / state

రంజాన్​ కానుకలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే - ramjan_kanuka_pampini_

యాదాద్రి భువనగరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని పలు గ్రామాల్లో ముస్లింలకు రంజాన్​ పండుగ కానుకలను ఎమ్మెల్యే సునీత పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు.

mla gongidi sunitha ramadan gifts distribution in yadadri bhuvanagiri district
రంజాన్​ కానుకలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : May 15, 2020, 11:47 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉన్న ముస్లింలకు హీల్ స్వచ్చంద సంస్థ సహకారంతో రంజాన్ పండుగ కానుకలను ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్​రెడ్డి అందించారు. అనంతరం గ్రామ పరిశుద్ధ్య కార్మికులను శాలువాతో సత్కరించారు. కరోనా కాలంలో ముస్లిం సోదరులు రంజాన్ పండగ చేసుకోవడానికి హీల్ స్వచ్చంద సంస్థ చేస్తున్న సేవలను ఆమె కొనియాడారు.

కరోనా వైరస్​పై ప్రతి ఒక్కరు యుద్ధం చేయాలని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రతిఒక్కరూ విధిగా ముఖానికి మాస్కులు ధరించాలని సూచించారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గ్రామాల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే స్థానిక అధికారులకు లేదా 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లో తప్ప మరెక్కడా కరోనా కేసులు లేవు: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.