ETV Bharat / state

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి: ఎమ్మెల్యే గాదరి - ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్​ తాజా వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్​ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

MLA Gadari Kishor Kumar toured in Yadadri district
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి: ఎమ్మెల్యే గాదరి
author img

By

Published : Oct 31, 2020, 6:27 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్​ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని అడ్డగూడూరు, ఆజింపేట, పొడిచేడు, ముషిపట్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని తెలిపారు. కరోనా నేపథ్యంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయలేదని.. ఒక్క తెలంగాణలోనే రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని వివరించారు.

రానున్న పది రోజుల్లో..

రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ. 580 కోట్లతో రైతు వేదికలను నిర్మిస్తోందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న పది రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని రైతు వేదికల నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్​ఫెడ్​ ఛైర్మన్​ కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదా, ఎంపీపీ దీటి సంధ్యా రాణి, మార్కెట్ వైస్ ఛైర్మన్ యాకూబ్ రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మీ, మండల రైతుబంధు కో-ఆర్డినేటర్లు మేఘా రెడ్డి, సోమ్మల్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి.. రైతులంతా కళ్లెర్రజేసి కేంద్రం కళ్లు తెరిపించాలి: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.