Minister Visit Yadadri: తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి పంచనారసింహుల క్షేత్రాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలమాలతో మంత్రికి స్వాగతం పలికిన అర్చకులు స్వయంభువుల దర్శనం అనంతరం ఆలయ మండపంలో ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ ఈవో వారికి లడ్డు ప్రసాదం అందజేశారు.
మఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమానగోపుర స్వర్ణతాపడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బంగారం కానుకగా సమర్పించారు. కిలో బంగారాన్ని ఆలయ ఈవోకు అందజేశారు. ఖమ్మం జిల్లా ప్రజల తరపున కిలో బంగారాన్ని విరాళంగా అందించినట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. అభివృద్ధికి ఆధ్యాత్మికతను జోడించి సమాజ నిర్మాణానికి పాటుపడుతున్న గొప్ప దార్శనికుడు సీఎం కేసీఆర్ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. యాదాద్రి గొప్ప దేవాలయాన్ని పునర్నిర్మించిన కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. దర్శన సమయంలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో భూపాల్ రెడ్డి, ఆలయ అధికారులు ఉన్నారు.
ఇవాళ ఉదయం తన జన్మదిన సందర్భంగా ఖమ్మంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో.. వేదపండితులు అర్చకుల నడుమ పువ్వాడ దంపతులు సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సుదర్శన యాగంలో. పాల్గొన్నారు. అనంతరం యాదాద్రి క్షేత్ర సందర్శనకు కుటుంబసమేతంగా తరలివెళ్లారు.
ఇవీ చదవండి: