యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అతి తక్కువ సమయంలో జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారిని కుటుంబ సమేతంగా మంత్రి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనాలు చేశారు. స్వామివారి సువర్ణ పుష్పార్చన పూజల్లో మంత్రి పాల్గొన్నారు. బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని స్వీకరించారు.
దర్శనం అనంతరం యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. వైటీడీఏ అధికారులను పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరలోనే ఆలయం భక్తులకు అందుబాటులోకి రావాలని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు. అత్యంత అద్భుతంగా శిలల నిర్మాణం జరుగుతోందని.. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఆలయాభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా