ETV Bharat / state

పారిశ్రామికవాడల్లో స్థానికులకే 75% ఉద్యోగాలు: కేటీఆర్ - minister jagadeesh reddy

పారిశ్రామికీకరణతో పాటు.. పర్యావరణ హితంగా రాష్ట్రాన్ని పురోగమింపజేసేందుకు కట్టుబడి ఉన్నామని పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్​లో ఏర్పాటు చేసిన హరిత పారిశ్రామిక పార్కును ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెద్ద పీట వేస్తూ నిర్మించిన గ్రీన్ పారిశ్రామిక పార్కు అని మంత్రులు వెల్లడించారు.

హరిత పారిశ్రామిక పార్కును ప్రారంభించిన కేటీఆర్​
author img

By

Published : Nov 2, 2019, 6:38 AM IST

Updated : Nov 2, 2019, 7:44 AM IST

హరిత పారిశ్రామిక పార్కును ప్రారంభించిన కేటీఆర్​

ఇప్పటివరకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న ప్రాంతాలతో పాటు.. రాష్ట్రం నలుదిశలా పరిశ్రమలు విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా రాజధానికి 35కి.మీల దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో ఈ హరిత పారిశ్రామిక పార్కుకు అంకురార్పణ చేసింది. టీఎస్​ఐఐసీ, తెలంగాణ పారిశ్రామిక సమాఖ్య భాగస్వామ్యంతో ఈ పార్కును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. 1,200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టులో వెయ్యికి పైగా ఎకరాల భూమిని సేకరించగా.. 450 ఎకరాల స్థలం ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీన్ని త్వరలో 2 వేల ఎకరాలకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం

పైలాన్​ను మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. భూములిచ్చిన రైతులను ఆదుకుంటూనే... స్థానికులకే సింహభాగం ఉద్యోగాలు దక్కేలా చూస్తామన్నారు. నలుదిశలా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానిక నిరుద్యోగ యువత అవకాశాలను అందిపుచ్చుకునేలా... ప్రభుత్వం ఏర్పాటు చేసే నైపుణ్య శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పారిశ్రామిక పార్కు ఆవిష్కరణ పట్ల స్థానిక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి స్వాగతిస్తూనే... ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఉండేలా ప్రభుత్వం ముందుకెళ్లాలని కోరారు. ఫార్మా, రసాయన పరిశ్రమల వ్యర్థాలతో ఇక్కడ ప్రాంతాలు కలుషితం కాకుండా చూడాలని ఆయన కోరారు.

132 కేవీ సబ్​స్టేషన్​ ఏర్పాటుకు అంగీకారం

పారిశ్రామిక పార్కు ఏర్పాటుతో పాటు... మౌలిక వసతుల కల్పనకు నడుం బిగించామని... 29 కోట్లతో రోడ్ల విస్తరణ, 6 కోట్లతో 33/11కేవీ సబ్​స్టేషన్​ ఏర్పాటు చేశామని మంత్రి జగదీశ్​ రెడ్డి పేర్కొన్నారు. పార్కు విస్తరణ దిశగా తీసుకునే చర్యల్లో భాగంగా 132 కేవీ సబ్ స్టేషన్​ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించగా... అందుకు సూత్రప్రాయంగా ఆయన అంగీకరించారు.

కామన్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్​ ఏర్పాటు చేస్తాం: కేటీఆర్

ఒకవైపు ప్రభుత్వ రంగంలో కొలువులు భర్తీ చేస్తూనే.. ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి కల్పనకు పెట్టుబడులు ఆకర్షిస్తూ పురోగమిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు ఉన్న అపోహలు తొలగించి, కరెంటు కావాలి మహాప్రభో అనే దుస్థితి నుంచి 24 గంటలు కడుపునిండా కరెంటు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించారు. చౌటుప్పల్​లో కొలువైన ఫార్మా, రసాయన వ్యర్థాలకు అడ్డుకట్ట వేసేలా కామన్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్​ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: ఆర్టీసీపై నిర్ణయమే అజెండాగా రాష్ట్ర మంత్రివర్గ భేటీ

TG_HYD_49_01_TSIIC_TIF_INDUSTRIAL_PARK_PKG_3181965 reporter : praveen kumar camera : suresh note : feed from ace media, 3g పారిశ్రామిక పార్కు ఏరియా విజువల్స్ కోసం నల్గొండ జేపీ గారు ప్యాకేజీలో పంపించిన విజువల్స్, పైలాన్ ఆవిష్కరణ విజువల్స్ వాడుకోగలరు. ( ) పారిశ్రామికీకరణతో పాటు.. పర్యావరణ హితంగా రాష్ట్రాన్ని పురోగమింపజేసేందుకు కట్టుబడి ఉన్నామని పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపూర్ లో ఏర్పాటు చేసిన హరిత పారిశ్రామిక పార్కును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెద్ద పీట వేస్తూ నిర్మించిన గ్రీన్ పారిశ్రామిక పార్కు ఇదని మంత్రులు ఉద్ఘాటించారు. LOOK V.O : ఇప్పటివరుక హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, అవుటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ప్రాంతాలతో పాటు.. రాష్ట్రం నలుదిశలా విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా రాజధానికి 35 కి.మీల దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో ఈ హరిత పారిశ్రామిక పార్కుకు అంకురార్పన చేసింది. tsiic, తెలంగాణ పారిశ్రామిక సమాఖ్య భాగస్వామ్యం తో ఈ పార్కును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. 1200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టులో వెయ్యికి పైగా ఎకరాలు సేకరించగా.. 450 ఎకరాల స్థలం ప్రస్తుతం రెడీలీ అవేలబుల్ గా ఉంది. దీన్ని త్వరలో 2 వేల ఎకరాలకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ సభాముఖంగా ప్రకటించారు. spot V.O : భూములిచ్చిన రైతులను ఆదుకుంటూనే.. స్ధానికులకే సింహభాగం ఉద్యోగాలు దక్కేలా చూస్తామన్నారు. నలుదిశలా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని.. స్థానిక నిరుద్యోగ యువత అవకాశాలను అందిపుచుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేసే నైపుణ్య శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. Byte కేటీఆర్, పరిశ్రమల శాఖామంత్రి V.O : అంతకుముందు పార్కుకు సంబంధించిన పైలాన్ ను మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిదులతో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. పారిశ్రామిక పార్కు ఆవిష్కరణ పట్ల స్థానిక మునుగోడు ఎమ్మెల్యే సభ అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి స్వాగతిస్తూనే.. ఇక్కడ కొలువయ్యే పరిశ్రమల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఉండేలా విధానపరంగా ప్రభుత్వం ముందుకెళ్లాలని కోరారు. ఫార్మా, రసాయన పరిశ్రమల వ్యర్థాలతో ఇక్కడ ప్రాంతాలు కలుషితం కాకుండా చూడాలని ఆయన కోరారు. Mla రాజగోపాల్ రెడ్డి V.O : పారిశ్రామిక పార్కు ఏర్పాటుతో పాటు.. మౌలిక వసతుల కల్పనకు నడుం బిగించామని.. 29 కోట్లతో రోడ్ల విస్తరణ, 6 కోట్లతో 33/11 k.v substation ఏర్పాటు చేశామని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. పార్కు విస్తరణ దిశగా తీసుకునే చర్యల్లో భాగంగా 132 కే.వీ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించగా అందుకు సూత్రప్రాయంగా ఆయన అంగీకరించారు. విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి V.O : ఒకవైపు ప్రభుత్వ రంగంలో కొలువులు భర్తీ చేస్తూనే.. ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి కల్పనకు పెట్టుబడులు ఆకర్షిస్తూ పురోగమిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు ఉన్న అపోహలు తొలగించి, కరెంటు కావాలి మహాప్రభో అనే దుస్థితి నుంచి 24 గంటల కడుపునిండా కరెంటు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించారు. ఢిల్లీలో రాష్ట్ర పారిశ్రామిక విధానం గురించి చర్చించి.. ఇతర రాష్ట్రాలు కోరే పరిస్థితి తీసుకొచ్చామన్నారు.పరిశ్రమల కోసం పర్యావరణాన్ని ఫణంగా పెట్టలేమని.. ఈ పార్కులో గ్రీన్ ఇండస్ట్రీ కె ప్రాధాన్యం అని నొక్కి చెప్పారు. చౌటుప్పల్ లో కొలువైన ఫార్మా, రసాయన వ్యర్థాల కు అడ్డుకట్ట వేసేలా common effluent plant ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్, పరిశ్రమల శాఖామంత్రి E. V.O :భూమి ఇచ్చిన కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా విధానంతో ముందుకెళతామని.. స్థానిక పిల్లలకు కొలువులలో సింహభాగంస్థానం ఇచ్చి ఇక్కడే ఉపాధి కల్పించాలని పారిశ్రామిక వేత్తలను కోరతామని కేటీఆర్ పేర్కొన్నారు.
Last Updated : Nov 2, 2019, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.