టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమర్థించుకున్నారు. రైతు రుణమాఫీపై వివరణ ఇస్తున్న సమయంలో పదే పదే తన ప్రసంగానికి ఉత్తమ్ అడ్డుపడ్డారని మంత్రి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతులకు మెగా రుణమేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట, వంగపల్లి, తుర్కపల్లి, రాజాపేట సహకార సంఘాల ద్వారా రైతులకు రూ.2 కోట్ల రుణాలు అందజేశారు. ఒక్కో సహకార సంఘానికి రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.2 కోట్లు కేటాయించి రైతులకు అందజేశామని మంత్రి పేర్కొన్నారు. కేవలం పావలా వడ్డీతో రైతులకు స్వల్పకాలిక రుణాలు అందజేస్తున్నామని వివరించారు.
ఇదీచూడండి: రైతులను రాజులను చేయడమే కేసీఆర్ లక్ష్యం: మంత్రి సబిత