ETV Bharat / state

'జైన్ ట్రస్టు'తో అందుబాటులోకి డయాలసిస్ సెంటర్: మంత్రి - మంత్రి జగదీశ్వర్​ రెడ్డి తాజా వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో డయాలసిస్​ సెంటర్​ను మంత్రి గుంతకుంట్ల జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. గతంలో డయాలసిస్​ కోసం ముంబై, హైదరాబాద్​ వెళ్లేవాళ్లమని, ఇప్పుడు ఆ అవసరం లేదని వివరించారు.

Minister Jagadishwar Reddy inaugurated dialysis center in alair yaadadri district
ఆలేరులో డయాలసిస్​ సెంటర్​ను ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి
author img

By

Published : Jun 28, 2020, 4:45 PM IST

అన్నిరకాల అనారోగ్యాలకు నీరే ప్రాథమిక కారణమని... వీటిని దూరం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్​ 'మిషన్​ భగీరథ' పథకాన్ని తీసుకొచ్చారని మంత్రి గుంతకుంట్ల జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. వాతవరణ మార్పులతో అనేక అనర్థాలు సంభవిస్తున్నాయని... అందువల్ల పర్యావరణ సమతుల్యత కోసం హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్​ను జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కిడ్నీ బాధితుల కోసం ఆలేరు పట్టణంలో డయాలసిస్​ సెంటర్​ ప్రారంభించడం సంతోషంగా ఉందని... దీని నిర్మాణానికి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చేసిన కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సెంటర్​ నిర్వహణకు ముందుకొచ్చిన భగవాన్​ మహావీర్​ జైన్​ రిలీఫ్​ ఫౌండేషన్​ ట్రస్ట్​ను అభినందించారు. ​అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు.

హైదరాబాద్​లోని 8 డయాలసిస్ సెంటర్లతో కలిపి, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 సెంటర్లు నిర్వహిస్తున్నామని ట్రస్ట్​ సభ్యులు ఇంద్రజీత్ జైన్ తెలిపారు. వీటిని తాము పవిత్రంగా భావించే కొలనుపాక జైనాలయంతో సమానంగా చూసుకుంటామని వివరించారు. ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి నిరంతర సాధనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అభినందనీయమన్నారు జిల్లా కలెక్టర్​ అనిత రామచంద్రన్.

ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, జేఎస్ఆర్ గ్రూపు సంస్థల అధినేత నారాయణ రావు, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణ రెడ్డి, జెడ్పీ వైస్ ఛైర్మన్ బీకు నాయక్, మున్సిపల్ ఛైర్మన్​ వస్పరి శంకరయ్య, ఎంపీపీ గంధమల్ల అశోక్, జెడ్పీటీసీ డాక్టర్ కుడుదుల నగేష్​ పాల్గొన్నారు.

ఆలేరులో డయాలసిస్​ సెంటర్​ను ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

ఇదీ చూడండి : పీవీకి అభిమానులెక్కువ.. ఘనంగా నిర్వహించండి: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.