రైతులంతా ఒకే వేదికపై ఉండి చర్చించే విధంగా... రైతులంతా ఒకే తాటిపైకి రావాలని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకు ఐదువేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా విభజించి.. రైతుల కోసం రైతు వేదిక భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం మండలంలో రైతు వేదిక భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ ఛైర్పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం 24 గంటల పాటు కరెంటును రైతులకు ఉచితంగా అందిస్తోందని చెప్పారు. రైతును రాజు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి: నేటి నుంచి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనా చికిత్స