ETV Bharat / state

కరోనా తగ్గుముఖం పట్టింది: జగదీశ్​ రెడ్డి

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టిందని విద్యుత్ శాఖ​ మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్​లో కరోనా, ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. 

విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి
author img

By

Published : May 13, 2021, 10:48 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్​లో కరోనా, ధాన్యం కొనుగోలుపై విద్యుత్ శాఖ​ మంత్రి జగదీశ్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్​తో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టిందని అన్నారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందడం లేదని అన్నారు.

లాక్​డౌన్​కు ప్రజలందరూ సహకరించాలని కోరారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని.. ఎవరూ ఆందోళన చెందరాదని భరోసా ఇచ్చారు. బీబీనగర్ ఎయిమ్స్ సేవలు అన్ని విధాలుగా వినియోగించుకుంటామని మంత్రి అన్నారు. పది రోజుల్లో ఆక్సిజన్ ట్యాంక్​ను నిర్మించి బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని కరోనా రోగులకు, ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇంటింటి సర్వే ద్వారా జిల్లాలో 4000 వేల మంది స్వల్ప అస్వస్థతతో ఉన్నట్లు గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆక్సిజన్, మందులు సరిపడా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈసారి యాసంగి పంట ధాన్యం ఎక్కువగా పండినందుకు జిల్లాలోని రైస్ మిల్లులకు రెండింతలు కేటాయిస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండి: రెండోరోజూ గ్రేటర్​లో లాక్‌డౌన్‌ అమలు.. నిర్మానుష్యంగా రోడ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.