indrakaran review on yadadri: రాజకీయ లబ్ధి కోసం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిపై విమర్శలు చేయడం సరికాదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి ఆక్షేపించారు. యాదాద్రిలో భక్తుల సౌకర్యాలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... దేవాదాయ, ఆర్ అండ్ బీ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
క్యూ కాంప్లెక్స్‌లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటం, వాష్ రూమ్స్‌లో పరిశుభ్రత, కొండపై చలువ పందిళ్లు ఏర్పాటు, మురుగునీటి కాల్వల నిర్వహణ, క్యూ కాంప్లెక్స్‌లో ఫ్యాన్‌ల నిర్వహణ, వృద్ధులు, వికలాంగులకు వీల్ఛైర్లు, కొండ కింద మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, ఇతర వసతుల ఏర్పాటుపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా అకాల వర్షం వల్ల ఉత్పన్నమైన సమస్యలు, పునరుద్ధరణ చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా వర్షాకాలంలోగా అధిగమించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మౌలిక వసతులపై ప్రధానంగా దృష్టిసారించాలన్నారు.
''యాదాద్రిలో మౌలిక వసతులపై అధిక దృష్టి సారించాలి. సామాన్య భక్తులకు శీఘ్రదర్శనం జరిగేలా చూడాలి. క్యూ లైన్లు, ఆలయంలోని భక్తులకు నీరు అందించాలి. ఆలయం బయట భక్తులు సేద తీరేలా వసతి కల్పించాలి. ఆలయ ప్రాంగణంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి.'' - ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి
ఇవీ చదవండి: