నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తెరాస ఘన విజయం సాధిస్తుందని మంత్రి చామకూర మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వేములకొండ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కు తీర్చుకోవటం కోసం వేములకొండకు వచ్చినట్లు ఆయన తెలిపారు. స్వామి వారి పూజలో మంత్రితో పాటు పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తాగు, సాగునీరు, ఫ్లోరైడ్ సమస్య తీరిందని మల్లారెడ్డి స్పష్టం చేశారు. మంత్రిని కలవడానికి వలిగొండ మండల తెరాస నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
ఇదీ చదవండి: జానారెడ్డికి ఓటమి భయం పట్టుకుంది: తలసాని