అనారోగ్యంతో బాధపడుతూ. తీవ్ర మనస్తాపానికి గురై ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో జరిగింది. పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన థామస్ అనే వ్యక్తి పట్టణంలో ఓ నగల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి నిద్రరాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రామన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలో గురువారం నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్