ETV Bharat / state

Munugode Bypoll: హైదరాబాద్​లో మునుగోడు భవితవ్యం... ఆ ఓటర్లే కీలకం! - మునుగోడు స్థానికేతర ఓటర్లు పై ప్రధాన పార్టీలు గురి

Munugode election:మునుగోడు భవితవ్యం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఓటర్లపై ఆధారపడనుంది. గెలుపు, ఓటముల్లో ఈ ఓట్లే కీలకంకానున్నాయి. హైదరాబాద్‌లో సుమారు 25 వేలకుపైగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓటర్లు ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ వారిపై దృష్టిసారించాయి.

munugode non local voters
మునుగోడు ఉపఎన్నిక
author img

By

Published : Oct 28, 2022, 7:51 AM IST

వలస ఓటర్లే కీలకం

Non local voters in munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికలకు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఓటర్లు కీలకంగా మారనున్నారు. సుమారు 25 వేల మందికిపైగా ఓటర్లు హైదరాబాద్‌లో ఉండడంతో వారిపై తెరాస, భాజపా, కాంగ్రెస్‌ దృష్టి సారించాయి. మునుగోడు నియోజకవర్గం హైదరాబాద్‌కు చేరువలోనే ఉన్నా పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. ఉపాధి కోసం మునుగోడు నుంచి వేలాది మంది హైదరాబాద్‌ వచ్చారు. సరైన విద్యాసంస్థలు సైతం లేకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం హైదరాబాద్‌ వచ్చి నివాసం ఏర్పర్చుకున్నారు. వారిని గుర్తించి ఆకట్టుకునేలా.. పక్కా ప్రణాళికతో ప్రధాన పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఈ బాధ్యతను హైదరాబాద్‌లోని ముఖ్య నేతలకు అప్పగించాయి. ఉద్యోగరీత్యా కానీ, వ్యాపారరీత్యా గానీ బతుకుతెరువు గురించి హైదరాబాద్​ దాదాపు 500 మంది వలస వెళ్లారని తెరాస ఎమ్మెల్సీ తాత మధు తెలిపారు. అందరిని ఓటింగ్​కు రమ్మని చెప్పడం జరిగిందని అన్నారు.

మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2 లక్షల 27 వేల 265. కొత్తగా ఏర్పాటైన గట్టుప్పల్‌ మండలంలోని తేరట్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 2 వేల 211 ఓట్లు ఉండగా... ఇందులో 520 మంది ఓటర్లు హైదరాబాద్‌లోనే ఉన్నారు. మునుగోడు మండలంలోని కల్వకుంట్ల, కొంపల్లి గ్రామాల్లో సుమారు 3 వేల ఓటర్లు ఉండగా అందులో 500 పైచిలుకు ఓటర్లు భాగ్యనగరంలోనే ఉన్నారు. ఇలా నియోజకవర్గంలోని ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లలో 200 నుంచి 600 మంది ఓటర్లు హైదరాబాద్‌లో ఉన్నట్లు పార్టీలు గుర్తించాయి. హైదరాబాద్‌లో నివాసం ఉండే మునుగోడు నియోజకవర్గ ఓటర్లు... ఉప ఎన్నికను ప్రభావితం చేయనున్నారు. దీంతో మూడు ప్రధాన పార్టీలు ఈ ఓటర్లను ఆకట్టుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇప్పటికే ప్రధాన పార్టీలు గ్రామాలవారీగా హైదరాబాద్‌లో నివసించే ఓటర్ల వివరాల జాబితా సిద్ధం చేశాయి. ఓటర్ల ఫోన్‌ నంబర్లు, అడ్ర్‌స్‌లు సేకరించాయి. తమ పార్టీకే ఓటు వేయించేలా చూసే బాధ్యతను ఆయా గ్రామాలకు చెందిన నేతలకు అప్పగించాయి. వారు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని హోటళ్లలో దిగి నిత్యం ఓటర్లను కలిసే పనిలో పడ్డారు. వివరాలు పూర్తిగా సేకరించిన తర్వాత విడతలవారీగా ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోటళ్లలో సమావేశాలు, విందులు ఏర్పాటు చేసేందుకు పార్టీలు ప్రణాళికలు చేస్తున్నాయి. ఏ సామాజికవర్గానికి చెందిన ఓటర్లను ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు సంప్రదించేలా ఆయా పార్టీలు ఏర్పాట్లు చేశాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.