యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని మెదక్ జిల్లాలోని రాంపూర్ పీఠాధిపతి మాధవానంద స్వామి దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలోని పనులను పరిశీలించారు. గర్భాలయం ఫ్లోరింగ్, స్పటిక లింగ ప్రతిష్ఠ విషయంలో కొన్ని సూచనలు చేశారు. ఈ ఆలయాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడం సంతోషకరమని ఆయన అన్నారు. వేగంగా పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పనులు 99 శాతం శాస్త్రోక్తంగా జరిగాయని తెలిపారు.
నూతన ప్రధాన ఆలయంలో పున:ప్రతిష్ఠ మహోత్సవం త్వరగా జరగాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. స్వామితో పాటు ఆలయ ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహమూర్తి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఏపీలో ఎల్లుండి నుంచి మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ