యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయ అష్టభుజ మండప ప్రాకారాలపై ఉన్న సాలహారాల్లో ఏర్పాటు చేయాలనుకున్న శ్రీ కృష్ణుడి విగ్రహాలను కృష్ణ శిలతోనే చెక్కాలని యాదాద్రి ఆలయ ప్రాధికార సంస్థ (యాడా) నిర్ణయించింది.
శ్రీ కృష్ణమహత్మ్యాన్ని వెల్లడించే రూపాలను గులాబీ రంగు రాతితో రూపొందించాలని గతంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి సూచించిన విషయం విదితమే. అయితే సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో కృష్ణశిలతో విగ్రహాలను చెక్కించాలని నిర్ణయించినట్లు యాడా వర్గాలు తెలిపాయి.
అధికారుల సమీక్ష
యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి పనులను గురించి సాంకేతిక కమిటీ హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. మండపాల్లో వర్షపు నీరు రాకుండా పక్కా చర్యలు చేపట్టాలని.. నిర్మాణ పనుల్లో ఎక్కడైనా లోపాలు జరిగితే వెంటనే సరిదిద్దాలని నిర్ణయించారు.
ఇదీ చూడండి: వరుణాగ్రహం... ఇంటి పైకప్పు కూలి తల్లీకూతుళ్ల దుర్మరణం