యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన రైతు అది బోతురాజు... పత్తి పంటపై మిడతలు దాడి చేసి నష్టం చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి సంతోషి దృష్టికి తీసుకువెళ్లారు. ఏవో ఆదేశంతో క్షేత్రస్థాయి పరిశీలనకు ఏఈవో శ్వేత గ్రామ సర్పంచ్ తుమ్మ డెన్నిస్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు భాషెట్టి యాదగిరితో కలిసి మిడతలు దాడి చేసిన పత్తి పంటను పరిశీలించారు.
ఇది సాధారణ మిడతలేనని... మారిన వాతావరణ పరిస్థితుల్లో వీటి ఉద్రిక్తత పెరిగిందని, దీని గురించి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఏఈవో శ్వేత తెలిపారు. వీటి నివారణ కోసం రైతులు పత్తి పంటపై లీటర్ నీటికి 5 మి.లీ. వేప నూనె, రెండు రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారి చేస్తే మిడతలు తగ్గిపోయి సాధారణ స్థితికి వస్తుందని... లేనిపక్షంలో క్లోరోపైరిఫాస్‌ను లీటరు నీటికి 5 మి.లీ.లు కలిపి పిచికారీ చేయాలని ఆమె సూచించారు.
ఇవీ చూడండి: అంబులెన్స్‌ను ఉపయోగంలోకి తేవాలని విపక్షాల నిరసన!