యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రధాన రహదారి విభాగినిపై సుందరీకరించిన వీధి దీపాలను స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ ఛైర్మన్ ఆంజనేయులు, అధికారులు పాల్గొన్నారు. పట్టణంలో మొత్తం విభాగిని పై 300 దీపాలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ వంశీ వెల్లడించారు.
ప్రయోగాత్మకంగా 30 వీధి దీపాలు
అందులో ప్రయోగాత్మకంగా 30 వీధి దీపాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. మిగిలిన పనులు త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మున్సిపల్ ఛైర్మన్ ఆంజనేయులు అన్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. సాయంత్రం నుంచి కర్ఫ్యూ అమలులో ఉండగా రాత్రి పూట ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించడం ఏంటని స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ప్రారంభోత్సవం చేశారని ఆరోపించారు.
ఇదీ చూడండి: మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ