ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి అన్ని రంగాలను సంక్షోభంలోకి నెట్టేసింది. రోజూ వేలాది మంది భక్తులతో కిటకిటలాడే యాదాద్రి ఆలయం.. ప్రస్తుతం వందల సంఖ్యలో భక్తులకే పరిమితమైంది. దీని వల్ల ఆలయానికి రావాల్సిన ఆదాయం భారీగా పడిపోయింది. ఏటా శ్రావణమాసంలో వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఆలయం.. ఈసారి బోసిపోయింది. ఈ ప్రభావంతో ఆలయ ఆదాయానికి గండి పడింది.
యాదగిరీశునికి ప్రధాన కైంకర్యాలలో భాగంగా నిర్వహించే పూజలు లేనందునే స్వామికి ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆలయంలో రూ. 100, రూ. 150 దర్శనాలు నిలిపివేసి.. ఉచితంగానే దర్శనాలకు అనుమతిస్తున్నారు. అది కాకుండా ఈ సారి.. శ్రావణమాసంలో నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతాలు, కల్యాణ కట్ట పూజలను ఆలయ అధికారులు రద్దు చేశారు.
2019 (రూ.లలో) | 2020 (రూ.లలో) | |
ప్రసాదాల విక్రయం ద్వారా | 1,31,99,260 | 54,81,475 |
ఆలయ ఖజానాకు చేరిన మొత్తం | 5,78,64,823 | 1,44,92,967 |
కొవిడ్ నేపథ్యంలో కల్యాణకట్టను నిలిపివేయగా.. ఆక్కడి నుంచి వచ్చే ఆదాయం కూడా రాకుండా పోయింది. ప్రస్తుతం ప్రసాదాల కొనుగోలు.. శాశ్వత పూజలతోనే ఆలయానికి ఆదాయం వస్తున్నట్లు ఆలయ అధికారవర్గాలు వివరించారు.
ఇదీ చూడండి 'యోగీ హయాంలో యూపీలో భారీగా తగ్గిన నేరాలు'