ETV Bharat / state

నీటి గండం: అప్పడు నాగార్జునసాగర్​.. ఇప్పుడు బస్వాపూర్​

author img

By

Published : Jun 14, 2020, 11:33 PM IST

దశాబ్ధాలు గడిచినా... తరాలు మారిన వారి రాతలు మాత్రం మారలేదు. అప్పడు నాగార్జునసాగర్​.. ఇప్పుడు బస్వాపూర్​తో వారి జీవితాలు ఆగమ్యగోచరంగా మారుతున్నాయి. పొట్టచేత పట్టుకొని మైళ్లదూరం వెళ్లినా... నీళ్లు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. బస్వాపూర్​ రిజర్వాయర్​ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న లప్పనాయక్​ తండా పరిస్థితిపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

lappanayak thanda people facing problems with floating in baswapur reservior
నీటి గండం: అప్పడు నాగార్జునసాగర్​.. ఇప్పుడు బస్వాపూర్​

నీటి గండం: అప్పడు నాగార్జునసాగర్​.. ఇప్పుడు బస్వాపూర్​

లప్పనాయక్​ తండావాసులది దురదృష్టకరమైన పరిస్థితి. తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలో ఉటుంది ఈ తండా. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో బస్వాపూర్​ రిజర్వాయర్​ నిర్మిస్తున్నారు. రిజర్వాయర్​ నిర్మాణంలో భాగంగా లప్పనాయక్​ తండా ముంపునకు గురవుతుంది. ప్రాజెక్టుల నిర్మాణాలన్నాక ముంపు సహజమే.. కానీ వీరిది మరో ముంపు కథ..

మైళ్లదూరం వచ్చినా..

ఇటీవలే లప్పనాయక్​ తండా గ్రామపంచాయతీగా మారింది. కానీ ఏం లాభం ఊరే లేకుండా పోతుందని స్థానికులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు. ఏడు దశాబ్దాల క్రితం నాగార్జునసాగర్​ ఎడమ కాలువ నిర్మాణంలో భాగంగా... అడ్డంగా ఉందని తండాను తొలగించారు. నయా పైసా పరిహారం ఇవ్వలేదు అప్పటి సర్కారు. దిక్కు తోచని స్థితిలో పొట్టచేత పట్టుకొని... యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం శివారులో ఆవాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. బస్వాపూర్​ ప్రాజెక్టులో భాగంగా ముంపునకు గురై... మరోసారి నీళ్లు వాళ్ల బతుకులను ముంచాయి.

సామర్థ్యం పెంపుతో..

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా... 0.8టీఎంసీల సామర్థ్యంతో బస్వాపూర్​ రిజర్వాయర్​ నిర్మించేందుకు వైఎస్సార్​ హయాంలో పనులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్​... ప్రాణహిత-చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. బస్వాపూర్​ సామర్థ్యాన్ని 11.39 టీఎంసీలకు పెంచారు. దీంతో తండాలోని సుమారు 250 కుటుంబాల్లోని 650 మంది నిరాశ్రయులవుతున్నారు. 750 ఎకరాల భూములు సహా సర్వస్వం కోల్పోతున్నారు. తరాలు మారిన మా తలరాతలు మారలేదని తండావాసులు ఆవేదన చెందుతున్నారు.

ఇల్లుకు.. ఇల్లు..

మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, చర్చలు జరుపకుండా, పరిహారం ఎంతిస్తారో చెప్పకుండా, గ్రామాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడం సరికాదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్వాపూర్ రిజర్వాయర్​కు తాము వ్యతిరేకం కాదంటున్న గిరిజనులు... ప్రభుత్వం సరైన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యాదగిరిగుట్ట మండలంలోనే ఏదో ఒక చోట ఇల్లుకు ఇల్లు, భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సాధ్యం కాకుంటే చుట్టుపక్క గ్రామాల్లో రేటు ప్రకారం ఎకరానికి రూ.90 లక్షల చొప్పున పరిహారం చెల్లించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే గ్రామంలో ముగ్గురు చనిపోయారని, అయినా మమ్మల్ని పట్టించుకునే నాథుడేలేడని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

ఇదీ చూడండి: ఆపరేషన్​ దిల్లీ: కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.