యాదాద్రిలో గిరి ప్రదక్షిణ కోసం ఆరు వరుసల రహదారి ఏర్పాటుకు అధికారులు భూసేకరణ పనులను వేగవంతం చేశారు. రెండు రోజులుగా యాదగిరిగుట్టలో రహదారి భవనాల శాఖ అధికారులు సర్వే చేపట్టారు. కొండ కింద వైకుంఠ ద్వారం నుంచి ఆర్య వైశ్య సత్రం వరకు ఈ సర్వే కొనసాగుతుంది.
రహదారి మధ్య నుంచి 55 అడుగుల వెడల్పుతో కొలతలు వేసి మార్కింగ్ చేశారు. దీని వల్ల నష్టపోయే శాతం నమోదు చేసుకున్నారు. రెండు రోజులుగా అధికారుల పర్యవేక్షణలో సర్వేను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసే ఫ్లైఓవర్‌కు సంబంధించిన భూమిని కూడా అధికారులు పరిశీలించారు. ఈ సర్వేలో పట్టణ తహసీల్దార్ అశోక్ రెడ్డి, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.