ETV Bharat / state

Yadadri Temple: యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు... పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు - తెలంగాణ వార్తలు

ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి(yadadri temple) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన పూజను(laksha pushparchana pujalu) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో యాదాద్రిలో భక్తుల సందడి నెలకొంది.

Yadadri Temple:
Yadadri Temple:
author img

By

Published : Nov 15, 2021, 6:04 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి(yadadri temple) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారికి లక్ష పుష్పార్చన పూజలు(laksha pushparchana pujalu at yadadri) శాస్త్రోక్తంగా జరిగాయి. బాలాలయ మండపంలోని స్వామి వారి ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో దివ్యమనోహరంగా అలంకరించి...ప్రత్యేక వేదికపై వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం సుమారు గంటకుపైగా పూజలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన పూజలు(laksha pushparchana pujalu) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ వేడుకలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

ఏకాదశి సందర్భంగా యాదాద్రిలో లక్ష పుష్పార్చన పూజలు..

చకాచకా పనులు..

యాదాద్రి పుణ్య క్షేత్రాభివృద్ధిలో(Yadadri temple latest news) భాగంగా కొండపైకి వచ్చి, పోయే మార్గాల విస్తరణతో సహాపై వంతెనల నిర్మాణం జోరందుకుంది. కొండెక్కి, దిగే కనుమదారులకు రెండు దిక్కులా పైవంతెనలు నిర్మిస్తున్నారు. కొండకు ఉత్తరదిశలో 12మీటర్లు వెడల్పు, 650 మీటర్ల పొడవున కట్టే వంతెనకు రెండో ఘాట్ రోడ్డుకు కలపనున్న వంతెన పిల్లర్​కు వేయాల్సిన 22 స్లాబుల్లో... 14 పూర్తైనట్లు యాడా(Yadagirigutta Temple Development Authority) అధికారులు తెలిపారు. రూ.143 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వలయదారి ప్రణాళికల్లో భాగంగా ఈ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పాత కనుమదారి విస్తరణతోపాటు కొండెక్కేందుకు చేపట్టిన పైవంతెన కోసం పిల్లర్ల పనులు వేగవంతం చేశారు.

ఆధ్యాత్మికం.. ఆహ్లాదం..

యాదాద్రికి(yadadri temple) వచ్చే భక్తులకు ఆధ్యాత్మికతోపాటు ఆహ్లాదాన్ని పంచే విధంగా యాడ చర్యలు చేపట్టింది. యాదాద్రిలోని ప్రధాన గుట్టతోపాటు ప్రెసిడెన్షియల్‌ సూట్లు, టెంపుల్‌ సిటీ చుట్టూ ఉన్న గుట్టలకు సహజత్వం ఉట్టిపడేలా ‘గ్రీన్‌ టెర్రామెష్‌’ విధానంలో కృత్రిమ పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. ఈ పద్ధతిలో మొదట మెష్‌ను గ్రిల్స్‌తో ఏర్పాటుచేసి ముందుభాగంలో మీటరు మేర ఎర్రమట్టిలో సేంద్రియ ఎరువులు, గడ్డి విత్తనాలు చల్లుతారు. ఆ విత్తనాలు మొలకెత్తి, మొక్కలుగా ఎదిగి ఏడాదంతా పచ్చదనాన్ని పంచుతాయి. ఈ విధానం ద్వారా రూపొందించిన గుట్టలు పటిష్ఠంగానూ ఉంటాయని యాదాద్రి ఆలయ ప్రాధికార సంస్థ(Yadagirigutta Temple Development Authority) (వైటీడీఏ) డీఈఈ మణిబాబు తెలిపారు. ప్రధాన ఆలయం చుట్టూ ఏర్పాటు చేస్తున్న ఈ గుట్టలు కుంభాభిషేకం నాటికి నాటికి పచ్చదనంతో యాదాద్రి దర్శనమివ్వనుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Yadadri Temple: పచ్చదనంతో... సహజత్వం ఉట్టిపడేలా యాదాద్రి పుణ్యక్షేత్రం ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.