యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అయ్యప్ప సేవా సమాజ్ ఆధ్వర్యంలో కార్తికమాసం సందర్భంగా లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారు. యాదాద్రి ఆలయ పునర్మిర్మాణం వల్ల స్వామివారి వైకుంఠ ద్వారం, కొండకింద ఉన్న ఉన్నత పాఠశాల ప్రాంగణం, లోటస్ టెంపుల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్తిక మాసాన్ని పురస్కరించుకుని మూడేళ్లుగా దీపోత్సవాన్ని చేపడుతున్నామని అయ్యప్ప సేవ సమాజ్ సభ్యులు వెల్లడించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పురపాలక ఛైర్మన్ ఎరుకల సుధా, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, హేమేందర్, లోటస్ టెంపుల్ ఛైర్మన్ బాలరాజు, సినీనటుడు లక్ష్మీ నారాయణ, పెండం శ్రీనివాస్, గురుస్వామి పాల్గొన్నారు.