యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా... ప్రసాదాల తయారీ యంత్ర పరికరాల బిగింపు మొదలైంది. ముంబయి, పూణే, కోయంబత్తూర్, నోయిడా నుంచి తెచ్చిన రూ. 5కోట్ల విలువైన భారీ అధునాతన యంత్రాలు కొండపైకి చేర్చారు. నూతనంగా నిర్మించిన ప్రసాదాల తయారీ కేంద్రానికి రెండు క్రేన్ల సాయంతో తలించారు.
హరేరామ హరే కృష్ణ ట్రస్ట్‌కు చెందిన అక్షయ పాత్ర ఫౌండేషన్, ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో... వైటీడీఏ అధికారులు యంత్ర పరికరాల బిగింపు పనులు చేపడుతున్నారు. రోజుకు 50 వేల నుంచి లక్ష లడ్డూలు తయారు చేసే సామర్థ్యం యంత్ర పరికరాలకు ఉందని అధికారులు తెలిపారు. వైటీడీఏ ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ వసంత నాయక్ కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు.
ఇదీ చూడండి: ముఖ్యమంత్రికి కేటీఆర్ కృతజ్ఞతలు.. ట్వీట్ చేసిన మంత్రి