యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దసరా పండుగ పురస్కరించుకుని ప్రముఖులు దర్శించుకున్నారు. కూకట్పల్లి, మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంత ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
నవీన్‌కుమార్‌కు ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు. వారికి ఆలయ అర్చకులు స్వర్ణ పుష్పార్చన పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.
ఇదీ చదవండి- రాష్ట్ర ప్రజలకు సీఎం విజయదశమి శుభాకాంక్షలు