KTR road show at Choutuppal: మునుగోడులో తెరాసను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ వద్ద రోడ్డు షో నిర్వహించిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్‌రెడ్డికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని కోరారు. రాజగోపాల్‌రెడ్డి తన పదవిని మూడేళ్ల నుంచే భాజపా దగ్గర బేరం పెట్టి రూ.18వేల కోట్లు గుంజుకుని.. కోవర్ట్ రాజకీయాలు చేశారని తీవ్రంగా విమర్శించారు. బరాబర్ చెబుతున్న తెరాసను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటానని మరోసారి స్పష్టం చేశారు.
భాజపా నాయకుల చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని భాజపా నాయకులు యత్నిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. చేనేత మీద జీఎస్టీ వేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీకే చెందుతుందన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి కేంద్రం సామాన్యులు నడ్డి విరిచిందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్‌ను అందిస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్యను మిషన్ భగీరథలో పరిష్కరించామని కేటీఆర్ అన్నారు.
రాజగోపాల్‌రెడ్డి ఉండడం కాంగ్రెస్ పార్టీలో కానీ మొదటి నుంచి భాజపా పాట పాడడం మొదలెట్టాడు. మూడేళ్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ భాజపాతో బేరసారాలు, కోవర్ట్ రాజకీయాలు చేసి రూ.18వేల కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. నియోజకవర్గ సమస్యలను గాలికి వదిలేశాడు. 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ మొత్తంలో వరిని అత్యధికంగా పండించే ప్రాంతం నల్గొండ అని చెప్పుకోవడానికి ఎంతో ఆనందంగా ఉంది. మిషన్ భగీరథ ద్వారా చౌటుప్పల్ పైలన్ ప్రాజెక్టు వేసి ఫ్లోరోసిస్ సమస్యను నిర్మూలించాము. మునుగోడును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాను. - కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి
ఇవీ చదవండి: