ముఖ్యమంత్రి కేసీఆర్ అల్టిమేటం జారీ చేసినా... 300 మంది కార్మికులు కూడా ఉద్యోగంలో చేరలేదన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కేసీఆర్ అంటే భయపడే రోజులు లేవని.. కార్మికులు, ప్రజలను చూసి సీఎం భయపడే రోజులు దగ్గరపడ్డాయని ఎద్దేవా చేశారు. భువనగిరిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సోనియాగాంధీ పిలుపు మేరకు ఈరోజు నుంచి ఈనెల 16 వరకు మోదీ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మోదీ మాట్లాడితే మేకిన్ ఇండియా అంటారని.. కానీ దేశంలో చైనా వస్తువులే దిగుమతి అవుతున్నాయని విమర్శించారు. రాష్ట్రం 60ఏళ్లల్లో 60 వేల కోట్ల అప్పు ఉంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రూ. 2 లక్షల 50 వేల కోట్లకు అప్పు పెరిగిందని దుయ్యబట్టారు. ఈ నెల 9న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా చలో ట్యాంక్ బండ్‌ను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండిః ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన విజయారెడ్డి అంత్యక్రియలు