యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలో భాజపాలోకి భారీస్థాయిలో వలసలు కొనసాగుతున్నాయి. చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో పలు పార్టీల నుంచి దాదాపు 100 మందికి పైగా కమల దళంలో చేరారు.
జెండా ఆవిష్కరణ అనంతరం భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో భాజపా పుంజుకుంటుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.