తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు రెండోరోజు వైభవంగా జరుగుతున్నాయి. వేదపారాయణలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నారసింహుడి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో భక్తులు లేకుండా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
జయంతి ఉత్సవాల్లో రెండోరోజైన ఇవాళ నరసింహ స్వామి కాళీయమర్దిని అలంకారంలో కొలువుదీరారు. అంతకుముందు స్వామివారికి లక్షకుంకుమార్చన నిర్వహించారు. మంగళ నీరాజనం, మంత్రపుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. జయంతి ఉత్సవాల్లో చివరి రోజైన రేపు సహస్ర ఘటాభిషేకంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలకనున్నారు.
- ఇదీ చదవండి: రానున్న మూడురోజులు రాష్ట్రానికి వర్షసూచన