ETV Bharat / state

నమ్మి లక్షలు ఇస్తే... తిరిగి ఐపీ నోటీసులొచ్చే...!

తెలిసినోళ్లందరి దగ్గర... అందినకాడికి అప్పులు చేశాడు. డబ్బులన్నీ తీసుకుని కానరాకుండా పోయాడు. అప్పులిచ్చిన వాళ్లందరూ కలిసి ఆరా తీస్తే... అందరినీ నిలువునా ముంచాడన్ని విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ముంచటం కూడా... చట్టబద్ధంగానేనండోయ్​.. అదెలా అంటారా... మీరే చూడండి.

ip notices given to lender in patimatla
ip notices given to lender in patimatla
author img

By

Published : Dec 27, 2020, 10:59 AM IST

లక్షల రూపాయలు అప్పుచేసి అడ్రస్ లేకుండా పోవడమే కాకుండా... ఐపీ నోటీసులు ఇచ్చిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్లలో ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన చిందం గోపాల్ యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన భార్యా ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్​లోని అంబర్​పేటలో నివాసముంటున్నాడు. పిల్లల ఉన్నత చదువుల కోసం, ప్లాట్లు కొనుగోలు చేస్తున్నానంటూ స్వగ్రామంలో ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద అప్పులు చేశాడు. ఇలా... మొత్తం 39 మంది వద్ద సుమారు యాబై లక్షలకు పైగా అప్పులు తీసుకున్నాడు.

ip notices given to lender in patimatla
గోపాల్​ తీసుకున్న అప్పుల వివరాలు....

ఈ క్రమంలో స్థానిక సర్పంచి దండె బోయిన మల్లేశంను సైతం నమ్మించగా... ఆయన కూడా రూ.లక్ష అప్పుగా ఇచ్చాడు. నెల రోజులుగా గోపాల్... స్వగ్రామానికి రాకపోవడం, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసి ఉండడం వల్ల బాధితులకు అనుమానం కలిగింది. హైదరాబాద్​కు వెళ్లి గోపాల్ ఇంటి వద్ద ఆరా తీయగా... అప్పటికే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు... ఉద్యోగం చేస్తున్న యాదగిరిగుట్ట డిపోలో విచారించారు. గోపాల్​... దీర్ఘకాలిక సెలవులో ఉన్నట్లు తెలిపిన డీఎం రఘు... తోటి ఉద్యోగుల వద్ద కూడా భారీగా అప్పులు చేసినట్లు పేర్కొన్నారు.

ip notices given to lender in patimatla
గోపాల్​ తీసుకున్న అప్పుల వివరాలు....

నమ్మి లక్షలు ఇచ్చిన వ్యక్తి కనబడకుండా పోయాడన్న బాధలో ఉన్న 39 మంది బాధితులకు... మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు... ఐపీ నోటీసులు కూడా అందాయి. గోపాల్​కు డబ్బుకు డబ్బు పోయి కోర్టు, లాయర్ల చుట్టు తిరగాల్సి వస్తోందని తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.

ఇదీ చూడండి: గిఫ్ట్​ల ఎర చూపి... ఆస్తులమ్ముకునేలా చేస్తారు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.