ETV Bharat / state

పాటే మంత్రం..మనసే బంధం

సుమధుర గాయకుడు.. గాన గంధర్వుడు.. సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం కన్నుమూశారు. ఎస్పీ బాలుకు ఉమ్మడి జిల్లాతో, యాదాద్రి సన్నిధితో ఎనలేని అనుబంధం ఉంది. ఆయనతో సన్నిహితంగా ఉన్న వారు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

intimate remembered the memories WITH SP BALU
పాటే మంత్రం..మనసే బంధం
author img

By

Published : Sep 26, 2020, 11:27 AM IST

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కవి, సాహిత్య, సామాజిక సేవకుడు పెద్దిరెడ్డి గణేష్‌ ఇంట్లో బాలసుబ్రహ్మణ్యం రెండు పర్యాయాలు బస చేశారు. 2007 మే 1న సినీ నటుడు, రచయిత గొల్లపుడి మారుతీరావు రచించిన ‘ఎలిజీలు’ సంపుటికి పెద్దిరెడ్డి గణేష్‌ పుస్తక రూపాన్ని తెచ్చారు. ఆవిష్కరించేందుకు తొలిసారిగా సూర్యాపేటకు వచ్చారు. 2013లో నవంబరు 21వ తేదీన గణేష్‌ రచించిన ‘గాన గాత్రం’ సంకలనాన్ని బాలుకు అంకితమిచ్చారు. సూర్యాపేటలో జరిగిన సభలో బాలు కాళ్లు కడిగి పుష్పాభిషేకం చేసిన గణేష్‌ను ‘మామగారు’ అని సంబోధించారు. పెద్దిరెడ్డి గణేష్‌ మాట్లాడుతూ బాలు లేనిలోటు ఎవరూ పూడ్చలేనిదని కంటతడిపెట్టారు.

-

ఎస్పీ బాలుతో 28 సంవత్సరాల అనుబంధం ఉంది. ఎక్కడ అతని కచేరీలు జరిగినా వెళ్లి తిలకించి వచ్చే వాడిని. పాటలు పాడడం అలవరచుకున్నా. ఆయన్ను తొలిసారి 1992లో కలిశాను. ‘మీ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తాన’ని అడగడంతో చెన్నైకి వచ్చేయమన్నారు. తల్లిదండ్రుల కోరిక మేరకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆయన్ను తరచూ కలిసేవాడిని. నేను పాడుతున్నప్పుడు బాలు గొంతుకు సరిపోలడంతో జూనియర్‌ బాలుగా పేరొచ్చింది. బాలు పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని శారదా స్టూడియోలో కుటుంబ సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలిపాను. ఓ టీవీ ఛానల్‌లో ఆయనతో కలిసి న్యాయ నిర్ణేతగా పాల్గొనడం మరిచిపోలేను.

అమీన్‌పాషా, జూనియర్‌ బాలసుబ్రహ్మణ్యం

నాపోస్టర్‌ డిజైన్‌ చూసి అభినందించారు

సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి దర్శకత్వంలో ‘మిథునం’ సినిమా రూపొందించారు. ఆ సినిమాకు నేను పోస్టర్‌ డిజైనర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశాను. ఆ సమయంలో అందులో ప్రధాన భూమిక పోషించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పరిచయం ఏర్పడింది. ఆ సినిమా పోస్టర్ల డిజైనింగ్‌ చూసిన బాలు నన్ను అభినందించారు. ఈ సినిమా 50 రోజుల పండగలో బాలు చేతుల మీదుగా జ్ఞాపికను అందుకోవడం నేను ఎన్నటికీ మరువలేను. అది అదృష్టంగా భావిస్తున్నాను.

- పోచం సోమేశ్వర్‌, సినీ కళాకారుడు, మోత్కూరు

రెండుసార్లు పెద్దిరెడ్డి గణేష్‌ గృహంలో బస...

‘యాదగిరి నరసింహస్వామి.. మమ్ము ఆదుకో సర్వాంతర్యామి.’, ‘ఎన్నెన్ని మహిమలు నీవి..’ పాటలు వింటే చాలు గుర్తుకొచ్చేది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే. బాలు తన పుట్టిన రోజు యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సందర్శించారు. అలా 2004 నుంచి 2014 వరకు పుట్టిన రోజు యాదాద్రీశుడి అభిషేకంలో పాల్గొని ఆశీస్సులు పొందారు. హరికథ చెప్పేందుకు 1960లో తండ్రి సాంబమూర్తితో వచ్చారు. 1980లో సినారె రాసిన యాదగిరి నరసింహస్వామి పాటలకు బాలు గాత్రమందించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మితమైన త్రినేత్రం సినిమాలో ‘శ్రీకర శుభకర’ పాటతో భక్తిత్వాన్ని చాటుకున్నారు. 2004లో బ్రహ్మోత్సవాల సందర్భంగా తన సోదరి శైలజతో కలిసి సంగీత విభావరి నిర్వహించారు. సినీ దర్శకుడు దాసరి నారాయణరావుతో పాటు బాలు కలిసొచ్చి ఇక్కడ బస చేసి ఉదయాన్నే పంచనారసింహులను దర్శించుకున్నారు.

చేతిరాతను చూసి పొగిడేవారు

నేను విఠలాచార్య దర్శకుడి వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లో వీరప్రతాప్‌, జైబేతాళ, ప్రచంఢ బైరవిలాంటి సినిమాలు చేశాను. ఆ సమయంలో పాటలు రాసిన రచయితల కాపీలను అందంగా తిరిగి రాసి పాట రికార్డింగ్‌ సమయంలో బాలుకు ఇచ్చేది. నా చేతిరాతను చూసి బాలసుబ్రహ్మణ్యం నన్ను ఎంతగానో పొగిడేవారు. అలా ఆయనతో మన్ననలు పొందిన నాకు సినీ పరిశ్రమలో ఎలా ఉండాలో, పెద్ద వారితో ఎలా మసులు కోవాలో చెప్పేవారు.

- సంజీవ, శ్వేతనాగు ఫేమ్‌, సినీ దర్శకుడు, నూనెగూడెం

2002 నుంచి ఇటీవల వరకు ఎస్పీ బాలుతో కలిసి పలు వేదికలపై పాటలు పాడా. 2012లో ‘ఈటీవీ’ ‘పాడుతా తీయగా’లో అవకాశం వచ్చింది. అప్పటినుంచి అనేక కార్యక్రమాల్లో నా గళం విన్పించే అవకాశం కల్పించారు. 2013లో ‘ఈటీవీ’ అమెరికాలోని పలు నగరాలలో నిర్వహించిన ‘పాడుతా తీయగా’లో 45 రోజుల పాటు ఎస్పీ పర్యవేక్షణలో పాటలు పాడా. 2017లో ఎస్పీతో కలిసి ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ పాడిన పాట ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ‘ఈటీవీ’ స్వరాభిషేకంలో ఆయనతో కలిసి పాటలు పాడటాన్ని జీవితాంతం మరిచిపోను. ఎస్పీ బాలుతో కలిసి పాటలు పాడటం నా జీవిత అదృష్టం.

- నందిభట్ల తేజస్విని, శాస్త్రీయ సంగీత గాయకురాలు, కాసనగోడు, కేతేపల్లి మండలం

‘ఆ ప్రశంస మరువలేను’

ఎస్పీ బాలు నా గాత్రం బాగుందని అభినందించడాన్ని జీవితాంతం మర్చిపోలేనని చౌటుప్పల్‌ మండలం పంతంగికి చెందిన గాయకుడు బుడ్డ శ్రీనివాస్‌ అన్నారు. ‘సినీనటుడు శోభన్‌బాబు జన్మదిన వేడుకలను శృతిలయ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో 2017లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించారు. ఆ ఉత్సవంలో ఎస్పీ బాలుకి స్వర్ణకంకణం ప్రదానం చేశారు. ఆ వేదికపై ‘ఎవరి కోసం ఈ మందహాసం’ అనే పాటను ఆలపించా. నా గాత్రం బాగుందని ఆయన అభినందించడం మర్చిపోలేను.

ఇవీచూడండి: కోటి రాగాల గళం మూగబోయిందంటే ఎట్టా నమ్మేది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.