రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చారు. అధికారుల సూచనల మేరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతవరణం కనిపించింది. కొండకింద కల్యాణ కట్ట, కొండపైన ప్రసాదాల విక్రయశాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటల సమయం , ప్రత్యేక దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పడుతోంది. ఆలయ ఆభివృద్ది పనుల దృష్ట్యా వాహనాలను పోలీసులు అనుమతించక పోవడంతో ఆటోలు, ఆర్టీసీ బస్సులో భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు.
ఇదీ చదవండి: సండే బ్యాంకింగ్.. డీసీసీబీ బ్యాంక్ వినూత్న ఆలోచన